నాలోపలి కాంతికి-భాస్కరుడికి ప్రేమతో


నాలోపలి కాంతికి


ఏ వాన మమ్మల్ని మొదట కలిపిందో
కలిసిన ప్రతీసారి
 పొడిగుండె మీద వానలా కురిసిపోతాడు

ఏ చెట్టు కింద మేము
తొలిసారి గుండెవిప్పి మాట్లాడుకున్నామో
చెట్టంతమనిషై నన్ను తనలో దాచుకుంటాడు

ఏ దుఃఖనదిలాగ పారుతూ
తనకు నాల్గు అక్షరాలు నేర్పించానో
నా దుఃఖాన్ని కరిగించే "భాస్కరు"డైనాడు

అమ్మను
ఎంతబాగా,ఎన్నిసార్లు చదువుకున్నాడో
భార్యను పసిబిడ్డాలా చూసుకునే గుణమొచ్చింది.

ఎన్నెన్నో అనుభవాలు
తనకు జీవితాన్ని వ్యాఖ్యానించి చెప్పాయో
తండాదారుల్లో రేలపూలచెట్టైనాడు

భాస్కరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలూ...

Comments